Wednesday, January 22, 2025

2కె రన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్‌రావు

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జహీరాబాద్ డివిజన్ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 2కే రన్‌ను సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఐబీ నుంచి మెథడిస్ట్ పాఠశాల గ్రౌండ్ వరకు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రా్రష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 21 రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్‌డిఓ జయదేవ్, డిఎస్పి రఘు, సిఐలు భూపతి, వెంకటేశ్, ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, మాజీ ఎంపిపి విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహివుద్దీన, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News