- Advertisement -
కోహీర్: మండలంలోని గొడియర్‌పల్లి గ్రామంలో రూ.20లక్షల నిధులతో నిర్మిస్తున్న పంచాయతీ భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమానికి బుధవారం ఉదయం 10.30 గంటలకు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు హాజరవుతున్నట్లు బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నర్సింలు యాదవ్ తెలిపారు. అలాగే రైతు నిరసన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గల రైతు వేదికలో నిర్వహించే రైతు సదస్సులో పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
- Advertisement -