Sunday, December 22, 2024

గిరిజన విద్యార్థినికి బాసటగా నిలిచిన ఎంఎల్ఎ మర్రి

- Advertisement -
- Advertisement -

బిజినేపల్లి ః బిజినేపల్లి మండలంలోని ఉడుగుల కుంట తండాకు చెందిన పాండు కుమార్తె కాట్రావత్ శ్యామల మెడిసిన్ విద్యకు ఎంఎల్ఎ మర్రి జనార్ధన్ రెడ్డి బాసటగా నిలిచారు. ఎంఎల్ఎ మర్రి జనార్ధన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం తన ఎంజెఆర్ ట్రస్ట్ నుంచి మెడిసిన్ మూడో సంవత్సరం ఫీజు 60 వేల రూపాయల చెక్కును విద్యార్థినికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి, రెండో సంవత్సరం ఫీజును గతంలో అందజేయగా నేడు మళ్లీ మూడవ సంవత్సరం కాలేజ్ ఫీజు 60 వేల రూపాయలను అందజేసిన ఎంఎల్ఎ మర్రి జనార్ధన్ రెడ్డికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News