Monday, January 20, 2025

కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాన/ములకలపల్లి : ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుబడుతు ఉండటమే కాకుండా వారికి అండగా నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కరేనని ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు పేర్కోన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదిక నందు సర్పంచ్ బీబినేని భధ్రం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు 25 మందికి కళ్యాణలక్ష్మి, ఒక్కరికి షాదిముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేసారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లల వివాహం అనంతరం ఆడపిల్ల తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ కళ్యాణలక్ష్మి, షాధిముబారక్ పధకాలను ప్రవేశపెట్టి కోట్ల రూపాయిలను ఖర్చు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ గుండె ధైర్యంతో కేంద్ర ప్రభుత్వ కుయుక్తులను తిప్పికొడుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుంచారన్నారు. మల్లి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ను చూడాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కోన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News