Sunday, May 11, 2025

మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో నూతన ఆలయ నిర్మాణం కొరకు, మండలంలోని ఆలయాల అభివృద్ధి గురించి, అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఆలయాల అభివృద్ది కొరకు, దమ్మపేట మండలంలోని ఆలయాల అభివృద్ధి దమ్మపేట పట్టణ కేంద్రంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ప్రభుత్వం ద్వారా అభివృద్ధి, ఆలయ భూముల సమస్య పరిష్కారం కొరకు, అలాగే ములకలపల్లి, అశ్వారావుపేట మండలాల్లోని

పలు ఆలయాల అభివృద్ధి కొరకు శుక్రవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హైదరాబాద్‌లోని సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన వినతి పత్రాలను సమర్పించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట చండ్రుగొండ మండల అధ్యక్షులు దారా బాబు, గంపెన వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, కుక్కల శ్రీను, ఇనుముల స్వామి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News