Saturday, January 11, 2025

మోకాళ్లతో తిరుమల మెట్లెక్కిన మానుకోట ఎంఎల్‌ఎ మురళీ నాయక్

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ ఎంఎల్‌ఎ భూక్య మురళీ నాయక్ మోకాళ్లతో తిరుమల తిరుపతి మెట్లెక్కారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆయన శుక్రవారం తిరుమల కొండ మెట్లెక్కి వేంకటేశ్వరస్వామికి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి రోజున తన నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని మొక్కున్నానని చెప్పారు. ఏడుకొండల వాడి అనుగ్రహం ప్రతి ఒక్కరికీ ఉండాలని, ప్రజలు మంచి ఆరోగ్యాలు, ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నట్లు తెలిపారు. కేసముద్రం మండలం, నారాయణపురం గ్రామస్థులకు పట్టాలు ఇప్పించడం తాను ఎంఎల్‌ఎ అయిన తర్వాత చేసిన గొప్ప పని అని చెప్పారు. గత ప్రభుత్వంలో నారాయణపురం గ్రామస్థులు వ్యవసాయ భూములు ఉండి నిరాశ్రయులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చొరవతో నారాయణపురం గ్రామస్థులకు న్యాయం చేశాననే తృప్తి మిగిలిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News