Monday, December 23, 2024

ఎంఎల్ఎ ముత్తిరెడ్డిని నిలదీసిన కూతురు..

- Advertisement -
- Advertisement -

జనగామ : సిద్దిపేట జిల్లా చేర్యాలలోని 1200 గజాల భూమిని తాను వైబోర్డ్‌హెచ్ కొనలేదని, తనను బెదిరించి సంతకం చేయించుకొని తన పేరు మీద భూమిని చేశారంటూ ఆరోపిస్తూ సోమవారం జనగామ మండలం వడ్లకొండ శివారులోని ఇరిగేషన్ క్వార్టర్స్‌లో జరిగిన హరితహారంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిని ఆయన కూతురు తుల్జాభవానిరెడ్డి, అల్లుడు రాహుల్‌రెడ్డి నిలదీశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాలలో తాను ఎలాంటి భూమి కొనలేదని, రోజంతా ఆఫీస్ బయట మనిషిని పెట్టి బలవంతంగా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొంది. ఆ భూమిని తాను ఇష్టపడలేదని, అనవసరంగా వివాదాస్పద భూమిలోకి తనను లాగారని ఆరోపించింది.

గతంలోనే ఓ కేసు ఎఫ్‌ఎస్‌ఐఆర్ అయిందని, ఇప్పుడు మరో కేసు పెట్టబోతున్నానని, పత్రాలపై చేసిన సంతకం మీదేనా కాదో క్లారిటీ ఇవ్వాలని కొన్ని పత్రాలను చూపిస్తూ ముత్తిరెడ్డిని నిలదీసింది. దీనిపై ముత్తిరెడ్డి స్పందిస్తూ బిడ్డ అనే మమకారంతో ఆస్తులు రాసిస్తే కేసు పెడుతావా? పెట్టుకో పరవాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా ఆమె సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై ముత్తిరెడ్డి మాట్లాడుతూ కొందరు చేతకాని దద్దమ్మలు తనను రాజకీయ క్షేత్రంలో ఎదుర్కోలేక అమాయకురాలైన తన కూతురిని తనపైకి ఉసిగొలుపుతున్నారని అన్నారు. ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, ఇలాంటి పనులు సరికావని ప్రత్యర్థులకు ఆయన సూచించారు.

వాళ్లకు పిల్లలు ఉన్నారని, వాళ్లూ రాజకీయాల్లోనే ఉన్నారని, తన బిడ్డను ఇలా బజారులో వేయడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై బురదజల్లాలని, బట్టకాల్చి మీద వేయాలని రాజకీయ ప్రత్యర్థులు చూస్తున్నారని, ఈ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News