మన తెలంగాణ/మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో కళ్యాణ కాంతులు వెదజల్లుతున్నాయని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు బాస్కర్‌రావు తెలిపారు. ఈ పథకాలను నిరుపేద ఆడబిడ్డలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 392 మంది లబ్దిదారులకు మంజూరైన రూ. 3కోట్ల, 92లక్షల, 45వేల 472 రూపాయల విలువచేసే చెక్కలను బాస్కర్‌రావు శనివారం పంపిణి చేశారు.
మిర్యాలగూడ పట్టణానికి చెందిన 83మంది లబ్దిదారులకు ఆడవిదేవులపల్లి మండలానికి చెందిన 48మందికి , వేములపల్లి మండలానికి చెందిన 14మందికి, మాడ్గులపల్లి మండలానికి చెందిన 22మంది లబ్దిదారులకు ఏఆర్ ఫంక్షన్ హాల్‌లో దామరచెర్ల మండలానికి చెందిన 144 మంది లబ్దిదారులకు అక్కడి రైతువేదిక భవనంలో చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల కొండంత భరోసాగా నిలుస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృధ్ది చేయడమే సిఎం కెసిఆర్ లక్ష్యమని అన్నారు.