Wednesday, January 22, 2025

ఆర్‌టిసి బస్సులో ప్రయాణించిన ఎంఎల్ఎ నోముల భగత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/త్రిపురారం : ప్రయాణికులకు చేరువలో ఆర్టీసి సేవలు ఉన్నందున సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నాగార్జున సాగర్ ఎంఎల్ఎ నోముల భగత్ కుమార్ అన్నారు. త్రిపురారం మండలంలో సోమవారం జరిగిన మేడే వేడుకలను ముగించుకుని త్రిపురారం నుండి హాలియా వరకు పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆర్టీసి బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఆర్టీసి అందిస్తున్న సేవలను , రాయితీలను సంస్థ ఉద్యోగులను కాపాడుకునేందుకు ప్రయాణికులు సహకరించాలన్నారు. ఆర్టీసిలో ప్రయాణం సురక్షితం అని , కార్మికులకు వివిద వర్గాల ప్రయాణికులకు ప్రభుత్వం అందిస్తున్న పలు రాయితీలు , ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నరేందర్, నాయకులు రామచంద్రయ్య, సర్పంచ్ కలగాని శ్రవణ్, ఏఎంసి డైరెక్టర్ కాశీం, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News