Thursday, December 19, 2024

బోనమెత్తి చిందులేసిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

జోగిపేట: ఆషాడమాసం పురస్కరించుకొని మంగళవారం జోగిపేటలో పలు చోట్ల అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పాల్గొన్నారు. రెండవ వార్డులో జరిగిన బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్ని బోనం ఎత్తుకున్నారు. యువకులతో కలిసి డప్పుచప్పుడుతో డ్యాన్స్ చేశారు. ఆయనతో పాటు యువకులు చిందులేశారు. అనంతరం కాలనీ వాసులు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. పట్టణంలో 17వ వార్డులో అధిక సంఖ్యలో గల ముదిరాజ్ సంఘం కుటుంబాల వారు బోనాలు కార్యక్రమం చేపట్టారు. భారీస్థాయిలో మహిళలు బోనాలు నెత్తిన ఎత్తుకొని డప్పుచప్పుడుతో పోచమ్మ దేవాలయం చేరుకున్నారు.

పోచమ్మ దేవాలయం వద్ద భక్తులతో నిండిపోయింది. ఆలయ కమిటీ ముందుగానే బోనాల పండుగను పురస్కరించుకొని దేవాలయంలో ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని అలంకరించారు. మున్సిపల్ ఆద్వర్యంలో బోనాలు తీసే కాలనీలలో రహదారులు శుభ్రం చేసి ఇరువైపుల సున్నం పోసి బోనాలకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పిట్ల లక్ష్మన్, చాపల వెంకటేశం, మల్లయ్య, సారశ్రీధర్, ఉల్వల వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News