Tuesday, September 17, 2024

నా ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది: పాడి కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తనతో పాటు ప్రతి ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి, ఎంపి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ వ్యక్తి గత సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా తెలుస్తోందని పాడి కౌశిక్ రెడ్డి అడిగారు. కరీంనగర్ సిపి ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల ఫోన్లను ట్యాప్ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం 40 శాతం మందికే రుణాలు మాఫీ అయ్యాయని మిగిలిన వారికి అవ్వలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ చెక్కులైనా పంపిణీ చేసేందుకు ఎంఎల్‌ఎలకు హక్కు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాంగ్రెస్ పార్టీవి కావు అని అవి ప్రజల సొమ్ము అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థి చెక్కులు పంచుతున్నారని మండిపడ్డారు. దీనిపై హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. సిపి ఫోన్ ట్యాపింగ్‌కు గురైనప్పుడు కేంద్రమంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని పాడి కౌశిక్ రెడ్డి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News