- Advertisement -
కరీంనగర్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట లభించింది. జిల్లా రెండో అదనపు మెజిస్ట్రేట్ ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రులు నిర్వహించిన సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాడి కౌశిక్ రెడ్డి గొడగకు దిగారు. దురుసగా ప్రవర్తించడంతో ఆయనను పోలీసులు బయటకు లాక్కెళ్లారు.
ఈ వ్యవహారంలో ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిని సామవారం రాత్రి హైదరాబాద్ లో కరీనంగర్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి కరీంనగర్ కు తరలించిన పోలీసులు.. మంగళవారం ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. దీంతో మెజిస్ట్రేట్ కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల చొప్పున ముగ్గురు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించింది.
- Advertisement -