Thursday, January 23, 2025

మంత్రి కెటిఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌ను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం కలిసి పలు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ జిల్లా కేంద్రమైన మెదక్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లు, రామాయంపేట మున్సిపాలిటీ రూ.15 కోట్లు నిధులు మంజూరు చేయాలని ఆమె కెటిఆర్‌ను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి నిధులను మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పలు అంశాలపై ఇరువురు చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News