Monday, December 23, 2024

రేవంత్ రెడ్డిని జైలులో పెట్టాలి: ఎంఎల్‌ఎ పెద్దిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రజలకు ఉపయోగపడుతోన్న ప్రగతిభవన్‌ను పేల్చివేయాలని వ్యాఖ్యలు చేసిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తక్షణం పిడి యాక్టు నమోదు చేసి జైలులో పెట్టాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి కె. జానారెడ్డిలు సమర్ధిస్తారా? అని నిలదీశారు.

బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు.. మహాత్మాగాంధీ మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా? అని ప్రశ్నించారు. పక్కనే ఉన్న చత్తీష్ ఘడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, అయితే అక్కడి ప్రభుత్వ భవనాలను కూడా కూల్చివేస్తారా?, దేశంలో ఉన్న పిసిసి అధ్యక్షులందరూ రేవంత్ రెడ్డిలానే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News