Wednesday, January 22, 2025

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ఎంఎల్‌ఎ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కూకట్ పల్లి ఎఎస్‌ఆర్ స్పోర్ట్ గ్రౌండ్‌లో ఎంఎల్‌ఎ మాధవరం కృష్ణారావు మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో  స్థానిక బిఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి : నిమ్మల సతీష్
తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు ముసారాంబాగ్ నారాయణి గౌ  సేవా సదన్‌లో తన తల్లి నిమ్మల అరుణ, కుటుంబ సభ్యులతో కలిసి అరుణ స్టూడియో ఎండి నిమ్మల సతీష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పుట్టినరోజు పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో గౌ సేవా సదన్‌లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు .పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించినందుకు ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌ సేవా సదన్ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News