Monday, December 23, 2024

ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

తొగుట: మండలంలోని ఘణపూర్ గ్రామంలో మల్లన్న సాగర్ అడిషనల్ కెనాల్‌కు సంబంధించిన చెక్కలు ఇచ్చిన సందర్భంగా ఘణపుర్ రైతులు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ రైతుల పక్షాన కోర్టులో కేసు వేసి రైతులకు చెక్కులు వచ్చేదాకా వారితో ఉండి చెక్కులు ఇప్పించిన ఘనత దుబ్బాక ఎమ్మెల్యే కే దక్కుతుందన్నారు. అప్పటి కలెక్టర్ వెంకట్రామారెడ్డి అడిషనల్ కెనాల్‌లో భూమి కోల్పోతున్న రైతులు సంతకాలు పెట్టకపోతే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు పోన్ చేసి మీరు ఒక్కసారి రైతులతో మాట్లాడి చెప్పి ఓప్పియ్యాలని అడిగారు . రైతులతో మాట్లాడి ములుగు గెస్ట్ హాస్‌కు రైతులను తీసుకెళ్లి సంతకాలు పెట్టించడానికి రైతులను ఓప్పించి కెనాల్‌కు సహకరించిన ఘనత దుబ్బాక ఎమ్మెల్యేదేన్నారు. మాట ప్రకా రం మూడు నెలల క్రీతం ఇస్తానన్న డబ్బులు మూడు సంవత్సరాలు అయి నా ఇవ్వకపోవడంతో రైతుల కోసం కోట్లాడి చెక్కులను ఇప్పించినందుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు మండల అద్యక్షు లు చిక్కుడు చంద్రం, ముదిరాజ్ సీనియర్ నాయకులు విభిషన్ రెడ్డి, బూత్ అధ్యక్షుడు బుచ్చిరాజు, బాలకిషన్, నంట స్వామిరెడ్డి, పరమేశ్, కరుణాకర్, లస్మవ్వ, మైసవ్వ, లక్ష్మి, నర్సింలు, నవీన్‌రెడ్డి,గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News