Monday, December 23, 2024

గురుద్వారలో ఎమ్మెల్యే పూజలు

- Advertisement -
- Advertisement -

వరంగల్ కార్పొరేషన్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా 26వ డివిజన్ సత్య హాస్పిటల్ సమీపంలోని గురుద్వారను సందర్శించి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ సర్వమత సమ్మేళనంతో కొనసాగాలని, ప్రతి మతాన్ని కేసీఆర్ సర్కారు గొప్పగా గౌరవించుకుంటోందని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు.

గురుద్వార కోసం ఏదైతే మాట ఇచ్చానో దానికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలిన సురేష్,డివిజన్ అధ్యక్షులు విజయ్ భరత్,జిల్లా మైనారిటీ అధికారి విక్రమ్,వల్లంగర్ సింగ్,మంజీత్ సింగ్,దాల్బీత్ సింగ్,హరిపాల్ సింగ్,అంజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News