Thursday, January 23, 2025

సిబిఐతో ఎంఎల్‌ఎల కొనుగోలు కేసు విచారణ

- Advertisement -
- Advertisement -

తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో సిబిఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఈ విషయమై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసును సిబిఐతో విచారణ చేయించాలని బిజెపి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ విచారణపై అన్ని వర్గాల వాదనలను హైకోర్టు వింది. తుది వాదనలు శుక్రవారంతో పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసుపై శుక్రవారం తుది విచారణ వింటామని గురువారం హైకోర్టు తెలిపింది.

శుక్రవారం ఉదయమే విచారణను ప్రారంభించింది. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసు విషయమై సిఎం మీడియా సమావేశానికి ఇలు ఎక్కడి నుండి తీసుకున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశ్నించారు. 65 బీ ఎవిడెన్స్ యాక్ట్ కింద సర్టిఫికెట్ లేదని సిట్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో శుక్రవారం సాయంత్రానికి సర్టిఫికెట్‌ను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం ఇరువర్గాల వాదనలను హకోర్టు వింది. ఈ కేసును సిబిఐతో లేదా స్వతంత్ర విచారణ సంస్థతో జరపించాలని బిజెపి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. సిట్ విచారణ సిఎం కనుసన్నల్లో సాగుతోందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు చెప్పారు. ఈ వాదనలను సిట్ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీన మొయినాబాద్ ఫాంహౌజ్‌లో బిఆర్‌ఎస్(టిఆర్‌ఎస్) ఎంఎల్‌ఎలను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు అరెస్టయ్యారు. సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, నందకుమార్, సింహాయాజులు స్వామీజీలను మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

తాండూరు ఎంఎల్‌ఎ పైలెట్ రోహిత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిట్‌తో కాకుండా సిబిఐతో విచారణ చేయించాలని బిజెపి పిటిషన్ వేసింది. ఇదే కేసులో మరికొందరు కూడా సిట్ విచారణ కాకుండా సిబిఐ విచారణ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో అన్ని వర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సిట్ తరపున ధవే వాదనలను వినిపించారు. బిజెపి తరపున మహేష్ జెఠ్మలానీ వాదించారు. ఈ కేసుకు సంబంధించి పలువురికి సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. బిజెపి అగ్రనేత బిఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్‌లకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను ఈ ముగ్గురు హైకోర్టులో సవాల్ చేశారు. సిట్ నోటీసులపై హైకోర్టు స్టే కూడా విధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News