Saturday, November 23, 2024

ఎంఎల్‌ఎల ఎర కేసు: సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎల కొనుగోలు కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును హైకోర్టు సిబిఐకి అప్పగించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును విచారణకు స్వీకరించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే కోరారు. సి బిఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వం సమవుతాయని దవే పేర్కొన్నారు. ఈ అంశా న్ని బుధవారం ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని దవేకు సిజెఐ సూచించారు. బుధవా రం ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వచ్చే వా రం విచారణకు అనుమతిస్తామని సిజెఐ జ స్టిస్ చంద్రచూడ్ తెలిపారు. అంతకుముందు ఎంఎల్‌లల కొనుగోలు కేసులో ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్‌పై మంగళవారం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకొని రావాలని సింగిల్ బెంచ్ పేర్కొంది. మొయినాబాద్ ఫాం హౌస్ కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలతో పాటు న్యాయవాది భూసారపు శ్రీనివాస్, కేరళకు చెందిన తుషార్ వెల్లపల్లిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన సింగిల్ జడ్జి… కేసు దర్యాప్తును సిట్ నుంచి సిబిఐకి అప్పగిస్తూ 2022 డిసెంబరు 26న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎంఎల్‌ఎ రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన అప్పీళ్లు విచారణార్హం కావని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News