Friday, November 15, 2024

ఆరుగురూ ఏకగ్రీవం

- Advertisement -
- Advertisement -

MLA Quota TRS 6 MLCs unanimous

ఎంఎల్‌ఎ కోటా
ఎంఎల్‌సిలుగా
టిఆర్‌ఎస్ అభ్యర్థులు
గుత్తా సుఖేందర్ రెడ్డి,
కడియం శ్రీహరి, బండ ప్రకాశ్,
తక్కెళ్లపల్లి రవీందర్‌రావు,
కౌశిక్ రెడ్డి,
వెంకట్రామిరెడ్డి ఎన్నిక
ధ్రువపత్రాల అందజేత

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికమయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సిలుగా ఎన్నికైన ఆరుగురు అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ నెల 16వ తేదీన గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి నామినేషన్లు దాఖలు చేయగా, అదే రోజు దాఖలైన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దాంతో టిఆర్‌ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది.

సమీకరణలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక

ఉత్కంఠభరిత పరిణామాల మధ్య చివరి నిమిషంలో టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎంఎల్‌సి అభ్యర్థులను ప్రకటించారు. మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి, బండా ప్రకాశ్‌ల పేర్లు చివరి నిమిషంలో జాబితాలో చేరాయి. అత్యంత వ్యూహాత్మకంగా.. పార్టీ, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలైన కడియం, గుత్తా సుఖేందర్‌రెడ్డిల ప్రాధాన్యం దృష్ట్యా వారికి మరోసారి అవకాశం కల్పించారు. పార్టీ సేవలకు గుర్తింపుగా తక్కెళ్లపల్లి రవీందర్‌రావును ఎంపిక చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పాడి కౌశిక్‌రెడ్డిని పేరును జాబితాలో చేర్చారు. మండలిలో బలమైన బిసి సామాజిక వర్గం ప్రాతినిధ్యం కోసం రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యునిగా 2024 మార్చి వరకు ఆయన పదవీ కాలం ఉన్నా.. ఆయనను ఎంఎల్‌సి అభ్యర్థిగా ఎంపిక చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News