Wednesday, January 22, 2025

కూతురికి ప్రేమ పెళ్లి జరిపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

ప్రొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన మొదటి కూతురు పల్లవికి దగ్గరుండి ప్రేమ వివాహం జరిపించారు. చదువుకునే రోజుల్లో ఆమె పవన్ అనే యువకుడిని ప్రేమించింది. కులానికి విలువ ఇవ్వకుండా పెళ్లి చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బొల్లవరంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ వేడుకలు జరిగాయి. ఆలయంలో వివాహం అనంతరం ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సంతోషకరమైన సందర్భంలో, ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి నూతన జంటను ఆశీర్వాదించారు. రెండు కుటుంబాల సమ్మతితో, వారు ఒకరి ఆచారాలు, సంప్రదాయాలను సంతోషంగా అంగీకరించి వివాహాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News