Saturday, January 11, 2025

కెసిఆర్ కొట్టే మొగోణ్ణి నేనే….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశారని బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ తెలిపారు. బండి సంజయ్ ది స్వయంకృతాపరాధమని మండిపడ్డారు. సొంత పార్టీపైనే ఎంఎల్‌ఎ రఘునందన్ విమర్శలు గుప్పించారు. రెండు నెలల్లో బిజెపి ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు. సోమవారం రఘునందన్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు వంద కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు సంజయ్ దగ్గర ఎక్కడ ఉందని రఘునందన్ ప్రశ్నించారు. పార్టీ డబ్బులో తనకు వాటా ఉందని, బిజెపి నేతలు తరుణ్‌చుగ్, బిఎల్ సంతోష్ ఫొటోలు చూసి ఓట్లేయలేదని విమర్శించారు. తన గెలుపు చూసే ఈటల పార్టీలోకి వచ్చారన్నారు.

Also Read: దుల్కర్ కంట కన్నీరు..వీడియో ఎందుకు డెలిట్ చేశాడు(వైరల్ వీడియో)

రఘునందన్, ఈటెల రాజేందర్ ఫొటోలు ఉంటేనే ఓట్లు వేస్తారన్నారు. రాజీనామా చేస్తే తాను గెలిపిస్తానని రాజ్‌గోపాల్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారని, మునుగోడులో అమిత్ షా గెలిపించలేకపోయారని చురకలంటించారు. వంద కోట్లు ఖర్చు పెట్టినా బిజెపి మునుగోడులో గెలవలేదని రఘునందన్ ఎద్దేవా చేశారు. తనకు వంద కోట్లు ఇస్తే తెలంగాణను దున్నేసేవాడినన్నారు. . సిఎం కెసిఆర్ కొట్టే మొగోణ్ణి తానేనని జనాలు నమ్మారన్నారు.  రెండోసారి కూడా దుబ్బాక నుంచి ఎంఎల్‌ఎగా గెలుస్తానని రఘునందన్ ధీమా వ్యక్తం చేశారు. తాను బిజెపిలో ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు. మొన్న జితెందర్ రెడ్డి ట్వీట్‌తో బిజెపి కలకలం సృష్టించింది. ఇప్పుడు రఘునందన్ చిట్‌చాట్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News