Monday, January 20, 2025

నిరంజన్ రెడి దత్తపుత్రుడిపై ఐటి అధికారులకు ఫిర్యాదు చేస్తా: రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయక మంత్రి నిరంజన్ రెడ్డిపై ఈడికి ఫిర్యాదు చేస్తానని దుబ్బాక బిజెపి ఎంఎల్ఎ రఘునందన్ రావు అన్నారు. సోమవారం రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్ రెడ్డి దత్తపుత్రుడిపై ఐటి అధికారులకు ఫిర్యాదు చేస్తా. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ దత్తపుత్రుడికి ఎలా దక్కాయి. అగ్రికల్చర్ వర్సిటీ విసిగా వియ్యంకుడిని నియమించుకున్నారు. మంత్రి భూమి వరకు 3 కిలోమీటర్లు సిసి రోడ్డు వేశారు. రైతులతో కలిసి రోడ్డును వేసుకున్నట్లు మంత్రి చెప్పారు. రూ.5కోట్లు ఖర్చు అయ్యే సిసి రోడ్డును రైతులు చందాలు వేసుకుని నిర్మించారా?.

మంత్రి పొలం, ఇల్లు రూ.4 కోట్లకే అమ్ముతానంటే కొంటాను. చైనా పౌరుడితో నిరంజన్ రెడ్డి తరచూ మాట్లాడారు. చైనాకు చెందిన ‘మో’తో మంత్రి లావాదేవీలపై దర్యాప్తు జరగాలి. అతనితో మంత్రికి సంబంధం ఏమిటి?. అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తున్నారు?. అని ప్రశ్నించారు. కాగా, మంత్రి నిరంజన్ రెడ్డి భూ అక్రమాలకు పాల్పడ్డాడని,  అక్రమంగా మూడు ఫామ్ హైస్ లను నిర్మించుకున్నారని ఎంఎల్ఎ రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News