Wednesday, January 22, 2025

ధరణి తెచ్చింది.. ప్రభుత్వభూముల ఆక్రమణకేనా?: రఘునందన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో మంత్రులు విలాసవంతమైన ఫామ్ హౌలు కట్టుకుంటున్నారని బీజేపీ ఎంఎల్ఏ రఘునందన్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి అగ్రి, హార్టికల్చర్ లోన్లతో ఫామ్ హౌస్ లు కట్టారని రఘునందన్ రావు ఆరోపించారు. వనపర్తి జిల్లాలో 165 ఎకరాల్లో మంత్రి ఫామ్ హౌస్ ఉందన్న రఘునందన్ కృష్ణనదిని ఆక్రమించుకుని మంత్రి ఫామ్ హౌస్ కు ప్రవారీ కట్టారన్నారు. మంత్రి ఫామ్ హౌస్ లో 3.5 ఎకరాల్లో సిసి రోడ్లు వేశారు.

Also read: తీన్మార్ మల్లన్నకు బెయిలు!

మంత్రి ఫామ్ హౌస్ ఉన్న తహశీల్దార్ ఆఫీసు కాలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 ఎకరాలు కొన్న మంత్రి 165 ఎకరాల్లో ప్రవారీ కట్టి ఆక్రమించుకున్నారని తెలిపారు. ధరణి తెచ్చింది.. ప్రభుత్వాభూముల ఆక్రమణకేనా?, భూకబ్జా చేయలేదని వ్యవసాయమంత్రి ప్రమాణం చేస్తారా?, గట్టుకాడిపల్లి ఆలయంలో మంత్రి ప్రమాణం చేస్తారా? తహశీల్దారు ఆఫీసు దగ్థంలో పాత్ర లేదని మంత్రి ప్రమాణం చేస్తారా అని రఘనందన్ రావు ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రలు ఫామ్ హౌస్ లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News