Sunday, December 22, 2024

దుబ్బాకను అభివృద్ధి చేస్తా.. కమలం గుర్తుకే ఓటెయ్యండి: రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

తొగుట : సిద్దిపేట తరహా దుబ్బాకను అభివృద్ధి చేస్తానని మరొక్కసారి కమలం గుర్తుకే ఓటు వేసి బీజేపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మంగళవారం తోగుట మండల పరిధిలోని ఎల్లారెడ్డిపేట పెద్ద మాసంపల్లి బండారుపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గతంలో చెప్పిన విధంగా తొగుట మండల పరిధిలోని అన్ని పరిస్తితులను అసెంబ్లీలో లేవనెత్తి, తోట మండల అభివృద్ధికి సహకరించాలని మరొక్కసారి గెలిపించాలని కోరారు.

తను బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే తొగుట మండల పరిధిలోని రోడ్లకు నిధులు తెచ్చి రోడ్లు పోసిన ఘనత తనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తుక్కాపూర్ సర్పంచ్ చిక్కుడు చంద్రం చందాపూర్ సర్పంచ్ బొడ్డు నరసింహులు ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచి ప్రవీణ్ రెడ్డి, బిజెపి నాయకులు నట్ట స్వామి రెడ్డి కరుణాకర్, రాజు చందు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News