Monday, December 23, 2024

ఉపాధ్యాయునిగా మారిన ఎమ్మెల్యే రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

కొండపాక: విద్యార్థులు మానసికంగా, శారీకంగా దృఢంగా ఉన్నప్పుడే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావు అన్నారు. బుధవారం మండలంలోని ఘనపూర్ గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 10/10 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పిల్లలు చిన్నప్పటి నుండే మంచి జీవన విధానం అలవాటు చేసుకోవాలన్నారు. ఉదయం లేవగానే యోగ, శారీరక వ్యాయామం చేయాలన్నారు. ప్రతిఒక్కరూ ఒక మొక్కను నాటి పరిరక్షించాలన్నారు. విద్యార్థులు ప్లాస్టిక్‌ను వాడొద్దని గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మర్చాలని వారికి పిలుపునిచ్చారు. రాబోయే తరాలు బాగుండాలంటే ఇప్పటి నుంచే పర్యావరణాన్ని కాపాడాలని వారు కోరారు.

యువకులు చదువుతో పాటుగా వారి గ్రామంపై బాధ్యతగా ఉండాలన్నారు. రోడ్డు మరమ్మతులు పూర్తికాగానే పాఠశాలకు అదనపు మరుగుదోడ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే స్కూల్‌కు కావల్సిన కంప్యూటర్లను అందిస్తామన్నారు. అనంతరం విద్యార్థులు చేసిననృత్యాలు అందిరని అలరించాయి. అనంతరం 10/10 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసి చైర్మన్ బుచ్చిరాజు, కుంబాల శ్రీను, బిజెపి పార్టీ అధ్యక్షుడు చిక్కుడు చంద్రం, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, విబీషన్ రెడ్డి, స్వామిరెడ్డి, మురళి, శ్రీనివాస్, శ్రవణ్, కర్ణాకర్, తిరుపతి, ప్రభాకర్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News