Saturday, December 28, 2024

తెలంగాణ పోలీసుల‌కు హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

MLA Raj Singh's wife files petition in High Court

త‌న  భ‌ర్త‌పై  పిడి  యాక్ట్ ఎత్తివేయాల‌ని ఎమ్మెల్యే రాజా సింగ్ భార్య పిటిష‌న్‌

హైదరాబాద్: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై పోలీసులు పిడి  యాక్ట్ కింద కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ్ హాట్ పోలీస్ స్టేష‌న్లో న‌మోదైన కేసు ఆధారంగానే రాజా సింగ్ అరెస్ట‌య్యారు. ఈ క్ర‌మంలో త‌న భ‌ర్త‌పై ప్ర‌యోగించిన పిడి యాక్ట్‌ను ర‌ద్దు చేయాలంటూ రాజా సింగ్ భార్య తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఆమె పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు మంగ‌ళ‌వారం దానిపై విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా రాజా సింగ్‌పై పిడి యాక్ట్ న‌మోదు చేయ‌డానికి గ‌ల కార‌ణాలు, అందుకు దారి తీసిన ప‌రిణామాల‌ను వివ‌రిస్తూ కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని మంగ‌ళ్ హాట్ పోలీసుల‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News