Wednesday, January 22, 2025

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌ !

- Advertisement -
- Advertisement -

 

 

Raja Singh and Munawar Faruqui

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ(బిజెపి) ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనను లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రేపటి మునావర్ ఫారుఖీ షోను ఆయన అడ్డుకొంటాననడంతో ముందస్తుగా రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కెటిఆర్ ఆహ్వానం మేరకే మునావర్ హైదరాబాద్ వస్తున్నారు.

మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీ షోపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో మునావర్ ఫారుఖీ షో నిర్వహించనున్నారు. బుక్ మైషోలో మొత్తం టికెట్లను నిర్వాహకులు విక్రయించారు. వేదికను తగలబెడతామని ఇప్పటికే బిజెవైఎం, రాజాసింగ్‌ హెచ్చరించారు. దీంతో మునావర్ ఫారుఖీ కామెడీ షోపై కలవరం నెలకొంది. శిల్పకళా  వేదికను రేపటికి నిర్వాహకులు బుక్ చేసుకున్నారు. ఇప్పటివరకు అడ్వాన్స్ అమౌంట్‌ కూడా నిర్వాహకులు చెల్లించలేదు. కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారన్న ఆరోపణలు మునావర్ ఫారుఖీ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వొద్దంటూ బిజెవైఎం నేతలు డిజిపిని సైతం కలిశారు. అయనప్పటికీ ఈ షోకు అనుమతి లభించింది.  రేపే షో జరగనుంది. కర్నాటక ప్రభుత్వం ఇదివరకే మునావర్ ఫారుఖీ షోను నిషేధించిందన్నది ఇక్కడ గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News