Sunday, December 22, 2024

ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూప్ కారు టైరు ఊడిపడిపోయింది, అయితే కారు స్పీడు తక్కువగా ఉండటంతో ప్రమాదం జరగలేదు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా ధూల్‌పేట ఎక్సైజ్ కార్యాయలం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఎంఎల్‌ఎ రాజాసింగ్ సురక్షితంగా బయటపడ్డారు.

ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై రాజాసింగ్ గత కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో అనేకమార్లు ఆయన వాహనం రోడ్డుపై మొరాయించింది. ఆ వాహనం పాతది కావడంతో దాన్ని మార్చాలని ఆయన పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News