Monday, January 20, 2025

తొలి జాబితాలోనే అభ్యర్థిగా ఉంటా.. : రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగానే గోషామహల్ నుంచి పోటీ చేస్తానంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బిజెపి విడుదల చేసే తొలి జాబితాలోనే తన పేరు ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతేడాది ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పటి వరకూ దాన్ని హైకమాండ్ ఎత్తివేయలేదు. ఈసారి గోషామహల్‌లో బిజెపి తరపున విక్రమ్ గౌడ్ బరిలో ఉంటారనే వార్తలు వస్తున్న సమయంలో రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఒకవేళ పార్టీ తనపై సస్పన్షన్ ఎత్తివేసి గోషామహల్ నుంచి పోటీచేసే అవకాశం ఇవ్వకపోతే ఎన్నికలకే దూరంగా ఉంటానన్నారు. పార్టీ తరఫున నిలబడే అభ్యర్థికి తన వంతు మద్దతు ఇస్తానని తెలిపారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేస్తూ హైకమాండ్ గతేడాది తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందనే నమ్మకం ఉన్నదన్నారు. పార్టీ జాతీయ, రాష్ట్ర నేతల మద్దతు తనకు పుష్కలంగా ఉన్నదని, అందువల్లనే సస్పెన్షన న్ను ఎత్తివేసి తొలి జాబితాలోనే గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీచేసే అభ్యర్థిగా తన పేరు ఉంటుందనే ధీమాను వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News