Monday, December 23, 2024

పార్టీ మారడం లేదు : రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. బిజెపి నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బిఆర్‌ఎస్ గూటికి చేరబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మంత్రి హరీశ్ రావుతో రాజాసింగ్ భేటీ కావడం ప్రాధాన్యంగా మారింది. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసి నెలలు గడుస్తున్నా అధిష్టానం ఎటూ తేల్చడం లేదు.. పార్టీ శ్రేణులు సానుకూలంగా ఉన్నా అధిష్టానం వైఖరిపై తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని బండి సంజయ్ ఇప్పటికే పలుమార్లు అధిష్టానాన్ని కోరారు. మంత్రితో భేటీ వెనుక నిజంగా పార్టీ మారే విషయమేనా? లేక మరే అంశం మీద కలిశారా? అనేది చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నానంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ధూల్ పేట ఆసుపత్రి ఆధునీకీకరణపై మాట్లాడేందుకు మంత్రి హరీశ్‌రావును కలిశానని తెలిపారు. తాను బిజెపిని వదిలి ఏ పార్టీలోకి వెళ్లను. తనపై విధించిన సస్పెన్షనను బిజెపి ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా‘ అని రాజాసింగ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News