Tuesday, December 17, 2024

అల్లు అర్జున్ తప్పు లేదు: ఎమ్మెల్యే రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ ఘటనలో అల్లుఅర్జున్ కు ఆయన మద్దతు తెలిపారు. అల్లుఅర్జున్ అరెస్టుపై తాజాగా రాజాసింగ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ.. తొక్కిసలాట ఘటన పోలీసు శాఖ వైఫల్యమేనని అన్నారు.  తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గర్వాన్ని తెచ్చిపెట్టిన జాతీయ అవార్డు గ్రహీత అల్లుఅర్జున్ తప్పు లేదని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగియడంతో అల్లుఅర్జున్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ప్రస్తుతం జడ్జీ కేసు వివరాలను పరిశీలిస్తున్నారు.  కాగా,. అల్లుఅర్జున్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణను హైకోర్టు సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News