బీఫ్ ఫెస్టివల్ సమయంలో అరెస్టు చేసిన పోలీసులు
బొల్లారం పిఎస్‌కు తరలింపు
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు
బెయిల్ తెచ్చుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే, బిజేపి నాయకుడు రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 2016లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు విద్యార్థులు నిర్ణయించారు. ఈ సమయంలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీలోకి బిజేపి కార్యకర్తలతో కలిసి వెళ్లేందుకు యత్నించాడు. ఈ సమయంలో పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేసి బొల్లారాం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో పోలీసులకు రాజాసింగ్ మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు సెక్షన్ 295కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నాంపల్లిలోని కోర్టు తీర్పు చెప్పగా ఎమ్మెల్యే రాజాసింగ్ బెయిల్ తీసుకున్నాడు, నెల రోజుల్లో పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు.
MLA Raja Singh sentenced to two years in prison