Sunday, December 22, 2024

పదవి లేక కెటిఆర్‌కు పిచ్చెక్కినట్లుంది: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో బిఆర్‌ఎస్ అధికారంలో లేకపోవడం, కెటిఆర్‌కు ఎలాంటి పదవి లేకపోవడంతో పిచ్చిపట్టినట్లు ఉందని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అందు వల్లే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై నోటికొచ్చినట్లు కెటిఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజాసింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీ నేర్చుకోవాలని మాత్రమే చెప్పారని, అందులో తప్పేముందని రాజాసింగ్ ప్రశ్నించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ స్నాతకోత్సవ కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందించాల్సిన అవసరం ఏమిటని అన్నారు. భారతదేశ గొప్పతనం ఈ దేశ భాషా వైవిధ్యంలోనే ఉందని, ఇది దేశ గొప్పదనమని, దీనిని గర్వంగా స్వీకరించడం మానేసి భాషోన్మాదానికి పాల్పడితే అది దేశానికే ముప్పని కెటిఆర్ హెచ్చరించడం సరికాదని రాజాసింగ్ పేర్కొన్నారు. పక్క రాష్ట్రానికి వెళ్తే అందరూ ఏ భాషలో మాట్లాడతారు..? మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఏ భాషలో మాట్లాడే వారు అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News