Monday, December 23, 2024

రాజా సింగ్ ఆవేశంలో విచక్షణ కోల్పోయి మాట్లాడారు: రాపోలు ఆనంద్ భాస్కర్

- Advertisement -
- Advertisement -

MLA Raja Singh spoke out of anger

హైదరాబాద్: బిజెపి ఎంఎల్ఎ రాజా సింగ్ ఆవేశంలో విచక్షణ కోల్పోయి మాట్లాడారని మాజీ ఎంపి రాపోలు ఆనంద్ భాస్కర్ తెలిపారు. రాజాసింగ్ కూడా తన వ్యాఖ్యల పట్ల విచారంలో ఉన్నాడని భావిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ అక్రమాలపై చట్టబద్ధంగా సిబిఐ దర్యాప్తు జరుపుతుందని, సిబిఐ దర్యాప్తులో అన్ని అంశాలు బయటపడతాయని చెప్పారు. ఆధారాలు లేకుండా దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్లవన్నారు. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగానే పనిచేస్తాయని, తొందర పాటు చర్యలు ప్రజాస్వామ్యంలో నిలబడవని హెచ్చరించారు. కక్ష సాధింపు చర్యలు అనే ఆరోపణలు అధికార పక్షం ఎదుర్కొవడం సాధారణ అంశమన్నారు. అధికార పక్షం కింద అధికార యంత్రాంగం, దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయి కాబట్టి ఆరోపణలు రావడం సహజమేనని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News