Sunday, December 22, 2024

త్వరలోనే రాజాసింగ్‌పై సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నించే మీడియాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ ధ్వజమెత్తారు బుధవారం హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో “ఖేలో భారత్- జీతో భాగ్యనగర్‌” పేరిట నిర్వహించిన క్రీడల పోటీల ఫైనల్ మ్యాచ్‌ను ఆయన తిలకించారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యమించే నాయకులను ప్రభుత్వం అరెస్ట్ చేసి బెదిరిస్తోంది. మరో అయిదు నెలలు ఆగండి.. ప్రజలే బిఆర్‌ఎస్‌ను నిషేధించబోతున్నారు” అని ఆయన వెల్లడించారు.

ప్రధాని మోడీ ఖేలో ఇండియా పేరుతో బిజెపి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్రీడల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడా స్ఫూర్తితో ఏ రంగంలోనైనా సమిష్టిగా పనిచేస్తే రాణించవచ్చునన్నారు. ఓ వర్గం మీడియా ఆంధ్రప్రదేశ్‌లో మద్దతిస్తున్న పార్టీ నాయకుడికి సపోర్ట్ చేస్తోంది. మరో వర్గం మీడియా కాంగ్రెస్, బిజెపి మధ్య ఓట్లు చీల్చి బిఆర్‌ఎస్ ను గెలిపించాలని చూస్తోందన్నారు. ఈటల రాజేందర్ మా జాతీయ నాయకత్వాన్ని కలిస్తే తప్పేముంది? అన్నారు. మీరు ఢిల్లీకి పోతున్నారని స్క్రోలింగ్ వేస్తున్నారు..

అని బండిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నేను వెళ్లానా? నన్ను అధిష్టానం లవనేలేదు.. బ్రేకింగ్ లు మీరే వేస్తున్నారు…మీడియా సృష్టే. కర్నాటక ఫలితాలతో హిందుత్వం లేదన్నోళ్లకు.. ఆ దమ్ము ఏందో కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర ద్వారా నిరూపించామని గుర్తుచేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని అధిష్టానాన్ని కోరాం. త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటారని విశ్వాసం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News