Thursday, December 19, 2024

నూతన సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన ఎంఎల్‌ఎ తాటికొండ రాజయ్య

- Advertisement -
- Advertisement -

ధర్మసాగర్: ప్రజలకు విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకై నూతన సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి శనివారం ఎంఎల్‌ఎ తాటికొండ రాజయ్య శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి స్థానిక సర్పంచ్ రాజమణి మొగిలి అధ్యక్షత వహించగా ఎంఎల్‌ఎ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడారు.. ఈసందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ.. 543 వ్యవసాయ పంపుసెట్లకు ఒక వెయ్యి 18 డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి రూ.కోటి 48 లక్షల వ్యయంతో 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రాయగూడెం గ్రామంలో నిర్మించినట్లు తెలిపారు.

ఈకార్యక్రమంలో ధర్మసాగర్ పిఎసిఎస్ చైర్మన్, డిసిసిబి డైరెక్టర్ గుండ్రెడ్డి రాజేష్‌రెడ్డి, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మలకపల్లి సర్పంచ్ మునిగాల రాజు, వేలేరు జడ్పిటిసి సరితవిజేందర్‌రెడ్డి, ఎంపిటిసి బొడ్డు శోభ, సర్పంచ్‌లు రమేష్, కర్ర సోమిరెడ్డి, మామిడి రవీందర్‌యాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు సోంపల్లి కరుణాకర్, విద్యుత్ అధికారులు హరిప్రసాద్, స్వామినాయక్, ఎడిలు కిరణ్, దానయ్య, ఏఈ బస్కే సుధాకర్‌లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News