Wednesday, January 22, 2025

రైతును రాజు చేయడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/స్టేషన్ ఘన్‌పూర్: రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్షమని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. ఆదివారం చిల్పూరు మండలంలోని పల్లగుట్ట, చిల్పూరు, లింగంపల్లి గ్రామాల్లో పీఏసీఎస్, సెర్ప్, ఐకేపీ పీఏసీఎస్ ఛైర్మన్ నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పరిషత్ ఛైర్మన పాగాల సంపత్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రాజయ్య ప్రాంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధిని మహిళలను వేరుచేసి చూడవద్దని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే నాటికి 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం 22.74 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేయబడిందన్నారు. రాష్ట్రం సిద్ధించిన తరువాత సీఎం కేసీఆర్ కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అందించాలని సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను పునరుద్దరించడం ద్వారా చెరువులు, కుంటల్లో 262 టీఎంసీల నీటి నిల్వ సామర్థాన్ని పెంచుకోవడం జరిగిందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఆధునికరించడం ద్వారా రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగి భూగర్బ జలాల నీటి మట్టం సామర్థం కూడా పెరిగిందన్నారు. కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1.24 కోట్ల ఎకరాల భూమి సాగు చేయబడుతుంటే అందులో రికార్డు స్థాయిలో ఈ యాసంగిలో 57 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయబడిందన్నారు. తెలంగాణలో సాగు చేయబడుతున్న 1.24 కోట్ల ఎకరాల్లో 57 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయడం ద్వారా 80 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి నేరుగా 7100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి ఆ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే సాధారణ రకం రూ. 2040 మద్దతు ధరతో అదే విధంగా ఏ గ్రేడ్ రకం రూ. 2060 మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ నరేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News