సిటిబ్యూరోః బిజేపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ప్రగతి భవన్ వద్ద పంజాగుట్ట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని గత కొంత కాలం నుంచి ఎమ్మెల్యే రాజా సింగ్ కోరుతున్నారు. ఈ క్రమంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన వాహనాన్ని మార్చాలని సిఎం కెసిఆర్‌ను కోరడానికి ప్రగతి భవన్ వద్దకు వచ్చాడు. కానీ పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పుల్లారెడ్డి స్వీట్ హౌస్ వద్ద ఆపివేశారు.
దీంతో తన వెంట తెచ్చుకున్న బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లారు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు రాజాసింగ్‌ను అరెస్టు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో బుల్లెట్ ఫ్రూఫ్ కారు టైర్ ఊడిపోయింది. గతంలో కూడా తనకు కెటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ కారు ఇబ్బంది పెట్టిందని, మరో కారు కేటాయించాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన లేదని, పాతకారుకే మరమ్మతులు చేసి పంపిస్తున్నారని రాజాసింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే.