Wednesday, January 22, 2025

జీఎస్టీ కుంభకోణాన్ని సీబీఐకి బదిలీ చేయాలి: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసిన జిఎస్టీ కుంభకోణాన్ని సిఐడి నుంచి సిబిఐకి బదిలీ చేయాలని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఈ మేరకు మంగళవారం అమిత్‌షాకు లేఖ రాశారు. తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విభాగంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారిస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఏ5గా రాష్ట్ర మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పేరును పోలీసులు పేర్కొన్నారని అన్నారు.

తాజాగా ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలిసి జీఎస్టీ పన్ను ఎగవేతదారులకు సహకరించినట్టు అంతర్గత ఆడిటింగ్‌లో అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే సీఐడీ నుంచి సీబీఐకి ఈ కేసును అప్పగించాలని రాజాసింగ్ అమిత్ షాను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News