Monday, January 20, 2025

బండి ది కూల్చుడు..రేవంత్ ది పేల్చుడు: రసమయి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లపై బిఆర్‌ఎస్ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. బండి సంజయ్ ది కూల్చుడు.. రేవంత్ ది పేల్చుడు అంటూ ఎద్దేవా చేశారు.
బుధవారం అసెంబ్లీ లాబీల్లో రసమయి మాట్లాడుతూ, రేవంత్, బండి సంజయ్‌లు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేది బిఆర్‌ఎస్సేనని అన్నారు. ప్రజల్లో సిఎం కెసిఆర్ నాయకత్వం పట్ల అపారమైన విశ్వాసం నెలకొని ఉందన్నారు.

ఇప్పటికే రెండు సార్లు అధికారంలో బిఆర్‌ఎస్ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ….అది గులాబీ పార్టీని ఓడించే స్థాయిలో లేదన్నారు. తెలంగాణ ప్రజల్లో కెసిఆర్‌కు ఉన్న ఆదరణ ముందు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఏ మాత్రం సరిపోరని రసమయి వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న సంజయ్ ఆగకుండా కనీసం 20 గ్రామాల పేర్లు అయినా చెప్పగలరా? అని ఏద్దేవా చేశారు. కానీ కెసిఆర్‌కు ప్రతి జిల్లా, ప్రతి గ్రామంపై అవగాహన ఉందన్నారు. గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా రాష్ట్రంలో బిజెపికి వందస్థాయి డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు.

ఆ పార్టీ కంటే కాస్తో…కూస్తే కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు పడే అవకాశముందని రసమయి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News