Monday, December 23, 2024

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట

- Advertisement -
- Advertisement -

గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలకు భూమిపూజ
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

బెజ్జంకి: దేశంలోని ఎక్కడలేని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. శుక్రవారం మండలంలోని తిమ్మయ్యపల్లి, బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ భూమిపూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిధులు విడుదల చేస్తుందని తెలిపారు.

గ్రామాభివృద్దికి అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో సహకరించాలని కోరారు. ఇప్పటికే ప్రతి గ్రామానికి పారిశుద్ద నిర్వహణకు ట్రాక్టర్, హరితహారం వంటి కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నిర్మల, జడ్పీటీసీ కవిత, మార్కెట్ చైర్మన్ రాజయ్య, పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ఎంపీడీఓ దమ్మని రాము ఆయా గ్రామాల సర్పంచ్‌లు, లింగారెడ్డి, టేకు తిరుపతి, ఎంపీటీసీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News