Saturday, December 21, 2024

బోథ్ ఎంఎల్ఎ రాజీనామా?

- Advertisement -
- Advertisement -

బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీ మార్పుపై అనుచరులతో సమావేశమై మాట్లాడారు. ఎమ్మెల్యే గా తను ఎలాంటి తప్పు చేయలేదని, పార్టీకి ఎలాంటి నష్టం చేయలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. కొందరు చెప్పుడు మాటలు విని అధిష్ఠానం తనకు టికెట్ ఇవ్వలేదన్నారు. అందుకే బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని తెలియజేశారు. నాలుగు రోజుల్లో పూర్తి నిర్ణయం వెల్లడిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News