నల్లగొండ : తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రై తులకు ఉచితంగా 24గంటలు ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ అమెరికాలో యన్‌ఆర్‌ఐ మీట్ అండ్ గ్రీట్‌లో టీపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఫైర్ అయ్యారు. అమెరికాలో చేసిన ప్రకటన నేపథ్యంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వ్యవ సాయ రైతు వ్యతిరేక ఆలోచన విధానానికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖా మంత్రి పిలు పుమేరకు కొండమల్లేపల్లి పట్టణంలో నిరసన వ్యక్తం చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతి నిధులు పార్టీ శ్రేణులతో కలిసి రవీంద్రకుమార్ దహనం చేశారు.
ఈస ంద ర్భంగా మా ట్లాడుతూ అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నుముక అని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టే రైతుల గురించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిర్లక్షం చేశారని ఆయన అన్నారు. దేశాన్ని పాలిస్తున్న పా ర్టీ లు వ్యవసాయం, రైతులను చులకనగా చూస్తున్నారు అని ఆయన అన్నా రు. రైతుబంధు, రైతభీమా పథకాలు ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు చేయాలన్న రేవ ంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మండి పడ్డారు. రైతాంగంపై కా ంగ్రెస్ కక్ష కట్టిందని అన్నారు.
రైతుబంధు, రైతుభీమా, ఉచిత విద్యుత్, కాళేశ్వరం, మిషన్ కాకతీయ ఇ లా పలు రకాల రైతు సంక్షేమ పథకాలను అమలు చే స్తున్న తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పా ర్టీ మండల అధ్యక్షుడు రమావత్ దాస్రునాయక్, రైతుబంధు అధ్యక్షుడు కే సాని లింగారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ ఎస్టీసెల్ రాష్ట్ర నాయకులు నేనావత్ రాంబాబునాయక్, ఎలిమినేటి సాయి, కొండమల్లేపల్లి ఉపసర్పంచ్ గంధం సురేష్, బీఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు రమావత్ తులిసిరామ్, శంకర్ నాయక్, స త్యనారాయణ, వెంకటయ్య, కాశయ్య, శ్రీను, రాములు, భద్రు, రమావత్ లాలు, సైదిరెడ్డి పాల్గొన్నారు.