Wednesday, January 22, 2025

మంత్రి కెటిఆర్‌ను కలిసిన టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్‌ఎ రవీంద్రకుమార్

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/నల్లగొండ న్యూస్: మంగళవారం టిఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా మంత్రి కెటిఆర్‌ను కలిశారు. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించిన సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటిశాఖ మంత్రి కెటిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ను అభినందించారు. మంత్రిని కలిసిన వారిలో దేవరకొండ పిఎసిఎస్ ఛైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News