- Advertisement -
ఉట్నూర్: కళ్యాణలక్ష్మి-షాదీ ముబారక్ పథకం పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే రేఖ నాయక్ అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో 21 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాధీముభారక్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా సంతోషంగా వివాహాలు జరుపుకోవాలని కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.
పేద ప్రజల తరుపున సీఎంకు ధన్యవాదాలు తెలుపుకుంటున్ననన్నారు. ప్రతి ఒక్కరూ సీఎం కెసిఆర్ ఋణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెళ్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాధవ్ శ్రీరామ్, ఎంపీపీ పంద్రా జైవంత్ రావ్, వైస్ ఎంపీపీ బాలాజీ, ప్యాక్స్ చైర్మెన్ ప్రభాకర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు అజిమోద్దీన్, కోప్షన్ మెంబర్ రషీద్, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
- Advertisement -