Wednesday, January 22, 2025

యువత వ్యాపార రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే రేఖ నాయక్

- Advertisement -
- Advertisement -

 

ఉట్నూర్: యువత వ్యాపార రంగాలలో రాణించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యాంనాయక్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఎఆర్ఎస్ కళాశాల ఎదురుగా మైత్రి టిఫిన్ సెంటర్ ను సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… చిన్న,పెద్ద ఏదైన వ్యాపారం చేయడంలో తప్పులేదన్నారు, మైత్రి టిఫిన్ సెంటర్ యజమాని రవిని అభినందిస్తూ యువత అన్నిరంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు కందుకూరి రమేష్, మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రషీద్, రైతు బంధు మండల అధ్యక్షులు అహ్మద్ అజీమొద్దీన్,తెరాస మండల ఉపాధ్యక్షులు జవ్వాద్ అన్సారి,మోరీరాం పటేల్,సీడం సోనెరావు పటేల్,జాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News