నారాయణఖేడ్: నల్లవాగు ప్రాజెక్ట్ ఆయకట్టు కింద సిర్గాపూర్, కల్హేర్ మండల్లాలోని వానకాలం పంటలకు సాగునీటిని ఆదివారం ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భ ంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకొని అలుగుద్వారా దిగువకు వరదనీరు ప్రవహిస్తుందన్నారు. కాగా గం గమ్మ తల్లికి పూజ చేసి తెప్పను వదిలి ప్రాజెక్ట్ తూమును ఎత్తి పొలాలకు నీటిని వదిలారు. ప్రాజెక్ట్ ఆయకట్టు కింద అంతర్‌గాం, పోచాపూర్, గోసాయిపల్లి, సుల్తానాబాద్, బీబీపేట్, మార్డి, ఖానపూర్ (కె ), ఇందిరానగర్, కల్హేర్ గ్రామాలకు నీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మచైర్మన్ రాంసింగ్, ఎంపిపి జార మహిపాల్‌రెడ్డి, జడ్పిటిసి రాఘవరె డ్డి, ఖేడ్ మండల జడ్పిటిసి రాథోడ్‌లక్ష్మీబాయిరవీందర్‌నాయక్, మం డల పార్టీ అధ్యక్షుడు సంజీవన్‌రావుపాటిల్, ఆయా గ్రామాల సర్పంచు లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, రైతు సమితి అధ్యక్షుడు, నాయకు లు, నీటిపారుదలశాఖ అధికారులు, రైతులు, తదితరులున్నారు.
వరి పంటలకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
- Advertisement -