Thursday, November 14, 2024

సబ్సిడీ గొర్రెలు ఇప్పించాలని ఎంఎల్‌ఎ మెచ్చాకు వినతి

- Advertisement -
- Advertisement -

ములకలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మండలానికి చెందిన యాదవులకు సబ్సిడీ పై రెండవ విడత గొర్రెలు పంపిణీ పథకంలో గొర్రెలను ఇప్పించాలని అఖిల భారత యాదవ సంఘం మండల కమిటీ తరుపున ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావుకు వినతి పత్రంను అందజేశారు. మంగళవారం ఆ సంఘం మండల కమిటీ అధ్యక్షుడు మంచాల సారయ్య ఆధ్వర్యంలో మండలానికి చెందిన యాదవులు ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావును ఆయన స్వగ్రామం తాటిసుబ్బన్నగూడెంలో కలిసి తమ సమస్యలను వివరించారు.

అధికారులు రెండో విడత సబ్సిడిపై గొర్రెలను ఇస్తామంటే ఒక్కొక్క రైతు 43,750 రూపాయిలను బ్యాంకులో డిడిలు తీసి అధికారులకు ఇచ్చి సంవత్సరం కావస్తున్న తమకు గొర్రెలు రాలేదని తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి న్యాయం చేయాలని వారు ఎంఎల్‌ఎకు విన్నవించారు.దీనిపై స్పందించిన ఎంఎల్‌ఎ మెచ్చా నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి సమస్యను తీసుకెల్లి అందరికి న్యాయం చేస్తానని వారికి హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు గుంటూరు శేషగిరిరావు, మంచాల ఉపేందర్, గట్టిగొర్ల దర్గన్న, గోడేటి సురేష్, రవి, రాములు, నరేష్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, శేఖర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News