తాండూరు: తాండూరు అభివృద్ధ్దికి పాటుపడుతున్న తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికే మరోసారి తాండూరు టికెట్ రావడం ఖాయమని బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తాండూరులోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజు గౌడ్, అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు నయింఅప్పు, సీనియర్ నాయకులు శ్రీనివాస్‌చారి, పట్లోళ్ల నర్సింలు తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. తాండూరు ఎమ్మెల్యే టికెట్ నాకే వస్తుందని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పెద్దేముల్ మండలంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాండూరు నియో జకవర్గాన్ని గత 30 ఏళ్లలో లేని విధంగా అభివృద్ధ్ది పనులు చేయిస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికే టికెట్ రావడం ఖాయమంటున్నారు.
గతంలో ఎన్నడు లేని విధంగా తాండూరుకు నర్సింగ్ కాలేజ్, ఐఐటి కాలేజ్ మంజూరుతోపాటు అభివృద్ధి పనులకు గాను రూ.134 కోట్లు నిధులు మంజూరు చేయించారని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చేస్తున్న పనులను చూసే ఎమ్మెల్సీ వర్గం వారు ఎమ్మెల్యే వర్గంలో చేరడంతో జీర్ణించుకోలేక పోతు న్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యే టిక్కెట్ రోహిత్‌రెడ్డికి రావ డంతోపాటు అదే పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పార్టీకోసమే పనిచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దు ఘర్ చైర్మన్ రజాక్, ఇర్పాన్, రాజన్‌గౌడ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
తాండూరు టికెట్ ఎంఎల్ఏ రోహిత్‌రెడ్డికే
- Advertisement -
- Advertisement -
- Advertisement -